అవినీతి జడ్జి యశ్వంత్ వర్మ రాజీనామా

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలపై ఆయనపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ (Impeachment) జరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025లో ఢిల్లీలోని ఆయన నివాసంలో భారీగా నగదు పట్టుబడటంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయ్యేలోపే ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ పంపారు. దీనివల్ల ఆయనపై ఉన్న అభిశంసన ప్రక్రియ ఆగిపోవడమే కాకుండా, పెన్షన్ వంటి ఇతర ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుంది.



