దుగ్గిరాలలో అమ్మవారికి సరస్వతీ దేవి అలంకారం
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు మహంకాళి టెంపుల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 6వ రోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చారు. అక్షరాభ్యాసం చేసుకున్న 100 మంది చిన్నారులకు దేవాదాయ శాఖ తరఫున ఉచితంగా పలకలు, బుక్స్, పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. భక్తులు భారీగా హాజరై అమ్మవారిని దర్శించుకోగా, అందరికీ తీర్థప్రసాదాలు అందించారు.



