తమిళనాడు అసెంబ్లీలోకి జపమాల ఎందుకు?

తమిళనాడు అసెంబ్లీలోకి ఆర్థికమంత్రి మేరీ విల్సన్ క్రైస్తవ జపమాల తీసుకువరావడంపై బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. గతంలో తిరుపతి ఆలయంలో బడ్జెట్‌ను వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద ఉంచినప్పుడు మధురై ఎంపీ సు.వెంకటేశన్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలోకి జపమాల తీసుకువచ్చినప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అన్నారు. హిందూ సంప్రదాయాలను లౌకికత్వానికి వ్యతిరేకంగా చూపే తిరుమావళవన్ కూడా ఈ విషయాన్ని సమర్థించారని పేర్కొన్నారు.


