గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్పై పవన్ కీలక సూచనలు

ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం జనసేన ఏర్పాటుచేసిన ‘గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ ప్రచార రథాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి డా.గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ పలు సూచనలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ను కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం చేయకుండా, యువత సమస్యలను నిరంతరం తెలుసుకునే ప్రజాసేవా వేదికగా కొనసాగించాలని స్పష్టం చేశారు.



