ఫోన్ స్లోగా ఛార్జ్ అవుతోందా?

కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ స్పీడ్‌ను కొంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేస్తే నెట్‌వర్క్, మొబైల్ డేటా వంటి కనెక్షన్లు ఆగిపోతాయి. దీంతో బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ తగ్గి బ్యాటరీ తక్కువగా ఖర్చవుతుంది. అలాగే ఫోన్‌కు అనుకూలమైన ఒరిజినల్ లేదా క్వాలిటీ ఛార్జర్, కేబుల్నే యూజ్ చేయాలి. నకిలీ ఛార్జర్లతో బ్యాటరీకి ఇబ్బందులు రావచ్చు. అవసరం లేకపోతే బ్లూటూత్, మొబైల్ డేటా కూడా ఆఫ్ చేయడం ద్వారా ఛార్జింగ్ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.



