← Back to news

రాజ్‌ఠాకూర్‌ కృషిని ఓర్వలేకే విమర్శలు: కాంగ్రెస్‌

By Sagar· 3d ago· Peddapalli
రాజ్‌ఠాకూర్‌ కృషిని ఓర్వలేకే విమర్శలు: కాంగ్రెస్‌

TG: పెద్దపల్లి జిల్లా రామగుండం అభివృద్ధిపై ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ చేస్తున్న కృషిని రాజకీయ కోణంలో విమర్శించడం సరికాదని కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఎండీ ముస్తఫా, గట్ల రమేష్‌ అన్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందేలా ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ సింగరేణి ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ సూర్యనారాయణతో సమీక్ష నిర్వహించారని తెలిపారు. దీనిపై బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ విమర్శలు చేయడాన్ని ఖండించారు.

రాజ్‌ఠాకూర్‌ కృషిని ఓర్వలేకే విమర్శలు: కాంగ్రెస్‌

More in Local