విద్యుత్ వినియోగంలో ఆల్టైమ్ రికార్డు

తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. అక్టోబర్ 15న ఉదయం 10.29 గంటలకు విద్యుత్ డిమాండ్ 20,003 మెగావాట్లకు చేరుకుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అత్యధికం. వ్యవసాయం, ఇళ్ల అవసరాలు, వాణిజ్య రంగాల్లో విద్యుత్ వినియోగం పెరగడం దీనికి కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ రోజు రాష్ట్రంలో మొత్తం 334.54 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. పెరిగిన అవసరాలను తీర్చేందుకు విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది.
