కబ్జాకు HYDRAA చెక్!

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని HYDRAA కాపాడింది. ఆక్రమణదారులు వేసిన బ్లూ షీట్లను తొలగించి, రెండు ఎకరాలకు పైగా ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు కమిషనర్ AV రంగనాథ్ ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూమి ఆక్రమణకు సంబంధించి గతంలోనూ వివాదాలు, కోర్టు పరిణామాలు చోటుచేసుకున్నాయి.
