సన్నాలకు రికార్డు ధర.. క్వింటాల్ 2,950!

TG: సన్న ధాన్యం పండించిన రైతులకు ఇప్పుడు మంచి ధర వస్తోంది. నిజామాబాద్ జిల్లాలో వరి కోతలు మొదలయ్యాయి. ఇంకా పూర్తిగా ఎండని పచ్చి ధాన్యాన్ని కూడా వ్యాపారులు పొలం దగ్గరే కొంటున్నారు. BJT రకం ధాన్యానికి క్వింటాల్‌కు 2,950 రూపాయల వరకు ఇస్తున్నారు. ఇక్కడి ధాన్యం తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటూ కర్ణాటక, తమిళనాడుకు వెళ్తోంది. మరోవైపు సన్న బియ్యం ధర కూడా పెరిగింది. 3 నెలల్లో కేజీకి 10 నుంచి 13 రూపాయల వరకు పెరిగింది.



