విజయవాడలో తొలిరోజు 19 నామినేషన్లే..

విజయవాడలోని 86 డివిజన్లకు నామినేషన్ల ప్రక్రియ కోనసాగుతుంది. తొలిరోజు కేవలం 19 నామినేషన్లే దాఖలయ్యాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారు కాకపోవడంతో నామినేషన్లు తక్కువగా వచ్చాయి. YCP నుంచి 12, TDP నుంచి 4, జనసేన నుంచి 2, BJP నుంచి ఒకరు నామినేషన్ వేశారు. మేయర్ పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆదివారం గడువు ముగియనుండటంతో చివరి రోజుల్లో నామినేషన్లు పెరిగే అవకాశం ఉంది.



