పిల్లల చెక్క భజన.. అద్భుతం!

కర్నూలు జిల్లా హాలహర్వి మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా చెక్క భజన కార్యక్రమం జరిగింది. పాత సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిన్నారులు ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు. ప్రస్తుతం పండుగలంటే డీజేలు, సినిమా పాటలే హోరు. పాత కళలను పునరుద్ధరించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తక్కువ టైమ్‌లో చిన్నారులకు శిక్షణ ఇచ్చిన గురువు నాగరాజును గ్రామస్థులు అభినందించారు. కార్యక్రమం సక్సెస్ కావడానికి స్థానిక కళాకారులు సపోర్ట్ చేశారు.



