క్లాస్‌రూమ్‌లో విద్యార్థి డ్రగ్స్!
మహారాష్ట్రలోని ఠాణేలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ విద్యార్థి క్లాస్‌రూమ్‌లోనే డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరల్ అవ్వడంతో ఠాణే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వీడియో ఏ పాఠశాలకు చెందినదో, అందులో ఉన్న విద్యార్థి ఎవరో గుర్తించేందుకు విచారణ వేగవంతం చేశారు. వీడియో నిజమైనదేనా కాదా అనే చర్చ జరుగుతుండగా, మరోపక్క పాఠశాలల్లో పిల్లల భద్రత, పర్యవేక్షణ ఎంతవరకు ఉందో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు.



