లక్కాకులమ్మ హుండీ లెక్కింపు పారదర్శకంగా..!

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో లక్కాకులమ్మ జాతర హుండీ లెక్కింపుపై చర్చ మొదలైంది. సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్, ఉపసర్పంచ్ బొడిగే శ్రీనివాస్ ఈ అంశంపై స్పందించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం, దేవస్థాన జాతర కమిటీ ఆధ్వర్యంలో లెక్కింపు పారదర్శకంగా జరగాలని కోరారు. 25 ఏళ్ల నుంచి జాతర ఉత్సవం జరుగుతున్నా హుండీ లెక్కింపు అధికారికంగా జరగలేదని తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక మంత్రి దృష్టికి తీసుకెళ్లి జాతర మహోత్సవాలను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.
