గడువులోగా బియ్యం సరఫరా పూర్తి చేయాలి

సీఎంఆర్ బియ్యం డెలివరీలో జాప్యం లేకుండా చూడాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాములు రైస్ మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) బియ్యం డెలివరీలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ ప్రకారం నిర్ణీత గడువులోగా సీఎంఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.



