← Back to news

రక్తదానంలో కానిస్టేబుల్ అరుదైన సేవ

By A VIJAY KUMAR· 1d ago· Warangal
రక్తదానంలో కానిస్టేబుల్ అరుదైన సేవ

రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ఆదర్శంగా నిలుస్తున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా హనుమకొండలో తలసేమియా చిన్నారుల కోసం నిర్వహించిన శిబిరంలో 39వసారి రక్తదానం చేశారు. గత 21 ఏళ్లలో 87 రక్తదాన శిబిరాలు నిర్వహించి, దాతల సహకారంతో 18,912 మందికి రక్తం అందించారు. ఐదు రాష్ట్రాల్లో అనేక మందికి రక్తదానంపై అవగాహన కల్పించారు.

More in Local