రెడ్‌క్రాస్ కమిటీ ఎన్నికలకు రంగం సిద్ధం

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ నిర్వహణ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల అధికారి, జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్ తెలిపారు. ఎన్నికల కోసం మొత్తం 12 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 25న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. సెప్టెంబర్ 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల కొనసాగిస్తున్నట్లు తెలిపారు.



