యూరోపియన్ల కంటే 10 ఏళ్లు ముందే డయాబెటిస్!

యూరోపియన్లతో పోలిస్తే భారతీయులు సహా దక్షిణాసియా ప్రజలకు టైప్-2 డయాబెటిస్ దాదాపు 10 ఏళ్ల ముందే వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం, ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం, రక్తంలో కొవ్వులు పెరగడం ఇందుకు కారణాలుగా చెప్పారు. భారతీయుల ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, ప్రొటీన్, ఫైబర్ తక్కువగా ఉంటున్నాయని అధ్యయనం తెలిపింది. డయాబెటిస్ ముప్పు తగ్గాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని డాక్టర్స్ సూచించారు.



