తల్లిదండ్రులను చూసుకోవడం అదృష్టం: నాగార్జున

తల్లిదండ్రులను చూసుకోవడంపై నాగార్జున ఓ ఈవెంట్‌లో మాట్లాడారు. 'చిన్నప్పుడు మనకి జ్వరం వస్తే అమ్మానాన్నలు ఎలా చూసుకున్నారో, పెద్దయ్యాక వాళ్లని మనం అలాగే చూసుకోవాలి' అని చెప్పారు. తన భార్య అమల 88, 90 ఏళ్ల వయసున్న తన తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటుందని, ఆమెను చూసి గర్వపడుతున్నానని అన్నారు.

