'వరంగల్ అభివృద్ధి పనులకు వేగం పెంచాలి'

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని చైర్‌పర్సన్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. నిన్న కూడ కార్యాలయంలో హన్మకొండ కలెక్టర్, వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, RBO లకు భూసేకరణ, భద్రకాళి ఆలయ మాడ వీధులు, గ్రీన్‌ఫీల్డ్, ఎయిర్‌పోర్ట్, టెక్స్‌టైల్స్ పార్క్ కనెక్టివిటీ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.



