ఎడ్లబండిపై బడిబాట.. ఇదేం దుస్థితి!

TG: సరైన రోడ్డు, బస్సు సౌకర్యం లేక నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలం బామిని గ్రామంలోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు అధ్వానంగా మారడంతో చిన్నారులు నిత్యం కిలోమీటర్ల మేర బురద దారుల్లో ఎడ్లబండిపై పాఠశాలలకు వెళ్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గ్రామానికి పక్కా రోడ్డు నిర్మించడంతో పాటు విద్యార్థుల కోసం బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.



