Gen Z ఎదుర్కొంటున్న సమస్య ఏంటో తెలుసా ?

క్రింజ్ (Cringe) — ఇదే ఇప్పుడు జెన్-జీ యువతను వెంటాడుతోంది. తాము చేసే పనులు నలుగురిలో ఎక్కడ ఇబ్బందుల్లో పడేస్తుందోనని ఆందోళన ఎక్కువైపోతోంది. Yahoo/YouGov సర్వే ప్రకారం, 44% మంది యువత తాము చేసే పనులు ఇతరుల దృష్టిలో అల్లరిపాలైపోతామని భయపడిపోతున్నట్టు వెల్లడైంది. ఈ భయం వల్ల 40% మంది తమ భావాలను మనసులోనే దాచేసుకుంటే 30% మంది కెరీర్ అవకాశాలను సైతం వదులుకుంటున్నారు. సోషల్ మీడియాలో 'పర్ఫెక్ట్'గా కనిపించాలనే ఒత్తిడి వీరిలో సహజత్వాన్ని చంపేస్తోంది. నలుగురిలో నవ్వులపాలవుతామనే ఈ డిజిటల్ ఆందోళన యూత్ కెరీర్ పైన ఎఫెక్ట్ చూపిస్తోంది.


