ప్రాణత్యాగానికి సిద్ధమైన జంటలకు ఇరాన్ సామూహిక వివాహాలు

అమెరికా ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న సంకేతాల మధ్య ఇరాన్ ఇమోషనల్ గా కొన్ని పనులు చేస్తోంది. దేశ రక్షణ కోసం, యుద్ధంలో ప్రాణత్యాగానికి సిద్ధమైన 100కి పైగా యువ జంటలకు ప్రభుత్వమే సామూహిక వివాహాలు జరిపించింది. యుద్ధ సమయంలో దేశభక్తిని నూరిపోయడం కోసమే భారీ స్థాయిలో ఈ పెళ్లిళ్లు జరిపించింది. ఒక వేళ యుద్ధం వస్తే తమ దేశ యువత ఎలాగైనా ఎదుర్కొంటారన్న మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ వివాహాలు భారీ స్థాయిలో జరిపించింది.
