← Back to news

బెంగాల్‌లోని SRFTIలో ఘర్షణ..!

By A.Ajay· 2h ago

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌(SRFTI)లో ఆదివారం ఘర్షణ జరిగింది. ఆల్ ఇండియా గ్రాహక్ పంచాయత్‌(ABGP) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోస్టర్లు, బ్యానర్లు చింపారనే ఆరోపణలు వచ్చాయి. ‘Go Back RSS’ నినాదాలు వినిపించాయని BJP నేతలు తెలిపారు. ఘటనలో పలువురు విద్యార్థులు, లెక్చరర్స్ గాయపడ్డారు.

More in National