ల్యాబ్‌లో పెంచిన మెదడు కణాలు

మనిషి మెదడును ల్యాబ్‌లో ఏళ్ల తరబడి పెంచగలరా? సైంటిస్టులు మనిషి స్టెమ్ సెల్స్‌తో తయారు చేసిన చిన్న మెదడు కణాల సమూహాలను దాదాపు 7 ఏళ్ల పాటు ల్యాబ్‌లో పెంచారు. ఇవి పూర్తి మనిషి మెదడు కాదు.. కానీ మెదడులోని కణాలు కాలంతో ఎలా మారుతాయో తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఏళ్లు గడిచేకొద్దీ ఈ కణాల్లో సహజమైన మెదడు ఎదుగుదలను పోలిన మార్పులు కనిపించాయి. దీంతో మెదడు ఎలా అభివృద్ధి చెందుతుంది, కొన్ని వ్యాధులు ఎలా మొదలవుతాయో అర్థం చేసుకోవడానికి కొత్త దారి కనిపించొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.



