పోలీస్ అరాచకం.. యువతి గొంతు నొక్కి.!
ఢిల్లీ.. రాజ్‌ఘాట్‌లో అక్టోబర్ 10న మహిళా పోలీసులు ఓ యువతి గొంతు నొక్కిన వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రొటెస్టర్లను డిటైన్ చేసి బస్సులో తీసుకెళ్తున్న సమయంలో.. ఓ యువతి, మహిళా పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ యువతి ఓ పోలీస్ కాలర్ పట్టుకోగా.. ఇద్దరు మహిళా పోలీసులు.. ఆమె గొంతు నొక్కి చంపేంత పనిచేశారు. చుట్టూ ఇతర ప్రొటెస్టర్లు ఉన్నా.. చాలా సేపు ఊపిరాడకుండా చేశారు. చివరకు ప్రొటెస్టర్లు ఆందోళన చెయ్యడంతో.. మహిళా పోలీసులు వెనక్కి తగ్గారు.


