← Back to news

జాబ్ పోయింది.. ఆరు కోళ్లతో బిజినెస్ మొదలైంది!

By Nani Garikina· 4d ago· Ndtv
జాబ్ పోయింది.. ఆరు కోళ్లతో బిజినెస్ మొదలైంది!

Amazonలో జాబ్ పోయిన తర్వాత మళ్లీ మరో ఉద్యోగం వెతుక్కోవడమే సాధారణం. కానీ హైదరాబాద్‌కు చెందిన మారియా హర్షిత మాత్రం ఊహించని దారి ఎంచుకున్నారు. మార్చి 2026లో ఉద్యోగం కోల్పోయిన ఆమెకు వరుసగా జాబ్ రిజెక్షన్లు రావడంతో.. భర్తతో కలిసి ఆరు కోళ్లతో పెంపకం మొదలుపెట్టారు. తర్వాత కోళ్ల సంఖ్య పెరిగి గుడ్లు రావడంతో.. వాటిని అమ్మడం మొదలుపెట్టారు. అలా ఇంటి అవసరాల కోసం మొదలైన పని ఇప్పుడు చిన్న బిజినెస్‌గా మారింది. జాబ్ పోయినా కొత్తగా ఏదైనా మొదలుపెట్టొచ్చని ఆమె కథ చూపిస్తోంది.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.