లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ షేక్ అలీమ్ బాషా మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. లోతట్టు, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైనేజీల పూడికతీత, పారిశుధ్య పనులు చేపట్టడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు తగ్గాయని తెలిపారు. డ్రైనేజీల్లో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసర సమస్యలు ఎదురైతే 7093912653, 08645-295193 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.





