మైదుకూరు ఎన్నికలు వాయిదా

కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. నామినేషన్ల ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగి, అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ప్రత్యర్థులు చించివేయడంతో సరైన స్క్రూటినీ సాధ్యం కాదని జిల్లా కలెక్టర్ SEC రిపోర్ట్ ఇచ్చారు. దీని ఆధారంగా ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నామినేషన్ కేంద్రంలోకి గుంపు చొరబడి ధ్వంసం చేసిన ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. నెక్ట్స్ ఉత్తర్వులు వచ్చే వరకు ప్రక్రియకు బ్రేక్ పడినట్లే.



