← Back to news

ఎడతెరిపి లేని వర్షం.. రోడ్లన్నీ నిర్మానుష్యం

By B V Appalanaidu· 1d ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలో తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా రద్దీగా ఉండే టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్ వద్ద కూడా కస్టమర్లు లేక బోసిపోయాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు.

More in Local