← Back to news

హైడ్రాకు హైకోర్టు షాక్

By aravinda nyayapati· 14 Apr 2026· Telugu Report· Hyderabad
హైడ్రాకు హైకోర్టు షాక్

తెలంగాణలో అడ్డగోలుగా కూల్చివేతలకు పాల్పడుతున్న హైడ్రాకు హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశించింది. GHMC, పురపాలక సంఘాల చట్టం, ఇతర నిబంధలనకు అనుగుణంగా ఈ కూల్చివేతలకు ఒక విధివిధానాలు, మార్గదర్శకాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలో కూల్చివేతల సమయంలో హైడ్రా అత్యుత్యాహంతో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించిదని, ఆ తీరు సమర్థనీయం కాదని అక్షింతలు వేసింది. కేసు విచారణని ఈ నెల 20కి వాయిదా వేసింది.

More in Local