మహిళా ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించాలి

TG: మహిళా ప్రజాప్రతినిధులపై అనుచితంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని BRS మహిళా నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా ధర్నా చౌక్‌లో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిపై జరిగిన ఘటనను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మహిళా ప్రజాప్రతినిధుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.





