← Back to news

జానపద కళలను కాపాడుకుందాం: MLA

By DK· 4h ago
జానపద కళలను కాపాడుకుందాం: MLA

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటఅగ్రహారంలోని వినాయక మండపం వద్ద నిర్వహించిన వీధి నాటకంలో MLA డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి నాటక ప్రదర్శనను వీక్షించిన ఆయన, ప్రాచీన సాంప్రదాయ, జానపద కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారతం, రామాయణం, భాగవతంలోని ఘట్టాలను ఆధారంగా చేసుకుని వీధి నాటకాల రూపంలో ప్రదర్శనలు ఇవ్వడం ఇప్పటికీ కొనసాగుతుండటం అభినందనీయమన్నారు. మారుతున్న జీవన విధానంలోనూ ఈ కళలకు ఆదరణ తగ్గలేదని తెలిపారు.

More in Local