గవర్నమెంట్ హాస్పిటల్‌లో బిడ్డ పుడితే.. బేబీ కిట్

AP: గవర్నమెంట్ హాస్పిటల్‌లో ప్రసవించినవారికి ఇకపై ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించనున్నారు. గతంలో ఉన్న ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించారు. ఒక్కో కిట్‌లో 14 రకాల వస్తువులు ఉంటాయి. వీటి విలువ సుమారు రూ.1,400. బేబీ బెడ్, బట్టలు, టవల్, రీయూజబుల్ న్యాపీలు, పౌడర్, షాంపూ, బేబీ ఆయిల్, సోప్, రాటిల్ టాయ్ వంటి ఐటమ్స్ కిట్‌లో ఉంటాయి. ప్రభుత్వం దీని కోసం ఏడాదికి సుమారు రూ.51.55 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఆదేశించింది.


