యాక్సిడెంట్ పరిహారం చెల్లించేది ఎవరు?

ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ ఉన్న ఇండియాలో యాక్సిడెంట్ మరణాలు కూడా ఎక్కువే. ఓవర్ స్పీడ్, అజాగ్రత్త, అధ్వానపు రోడ్ల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో బాధితులు లేదా మృతుల కుటుంబాలు యాక్సిడెంట్ క్లెయిమ్స్ చేసుకోవచ్చు. పరిహారాన్ని వాహన యజమాని లేదా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రూల్స్ వయలేషన్ ఉంటే ఇన్స్యూరర్ ముందుగా పే చేసి ఆ తర్వాత ఓనర్ నుంచి రికవరీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. డెత్ కేసుల్లో నాలుగు ప్రధాన విభాగాల కింద కాంపెన్సేషన్ లెక్కిస్తారు.



