విద్యుత్ వైర్లు తెగి పాడి ఆవు బలి!

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలో గురువారం విషాద ఘటన జరిగింది. రైతు గడ్డి పెద్ద ఆంజనేయులు పొలం వద్ద ఆవును కట్టివేశారు. విద్యుత్ పోల్ విరిగి వైర్లు ఆవుపై పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. పాల విక్రయమే కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు అని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవు మృతితో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందన్నారు. అధికారులు ఘటనను పరిశీలించి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.




