రుషికొండ ప్యాలెస్ మాకివ్వండి !!

విశాఖ రుషి కొండ ప్యాలెస్ ను మెయిన్ టెయిన్ చేయడంపై ప్రముఖ స్టార్ హోటల్స్ తాజ్, ది లీలా అట్మాస్ఫియర్ కోర్, ఫెమా లాంటి గ్రూపులు ఆసక్తి చూపుతున్నాయి. రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న అంశంపై ఇప్పటికే అయిదుసార్లు భేటీ అయిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలపై నివేదికలు రెడీ చేసింది. వాటిని సీఎం చంద్రబాబుకు చూపించి ఆ తర్వాత తుదినిర్ణయం తీసుకుంటారు. మొత్తం మీద జగన్ హయాంలో నిర్మించిన ఈ అందాల ప్యాలెస్ వినియోగం లోకి రాబోతోంది.


