← Back to news

ఢిల్లీలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక

By Vishi· 2h ago· X

CEC జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక సహా పలువురు 'ఇండియా' కూటమి ఎంపీలు ఢిల్లీలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సంఘంలోని అవకతవకల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల నోరు మూయిస్తున్నారని ‘ఇండియా’ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

More in Current Affairs