← Back to news

ఈ రోబో డాన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

By Sahani· 1d ago· Instagram

రోబోల కదలికలు మనుషుల్లా నాచురల్‌గా ఉండేలా భారత్‌కు చెందిన 'ట్యూస్‌డే ల్యాబ్స్', 'మాస్టర్స్ యూనియన్' కలిసి 'మాయ' అనే హ్యూమనాయిడ్ రోబోను డెవలప్ చేశాయి. 'అవతార్' మూవీలో వాడిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌తో దీనికి ట్రైనింగ్ ఇచ్చారు. 'వజ్లే కీ బారా' మరాఠీ పాటకు ఒక క్లాసికల్ డ్యాన్సర్‌లా మాయ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు, రోబోలకు నేచురల్ మూవ్‌మెంట్స్ కోసం మేరీల్యాండ్ రీసెర్చర్స్ భరతనాట్యం ముద్రల సాయంతో AI ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు.

More in Technology

AI మ్యాజిక్.. 60 సెకన్లలో 60 హెల్త్ టెస్టులు
Technology· 1d ago

AI మ్యాజిక్.. 60 సెకన్లలో 60 హెల్త్ టెస్టులు

AP: మంగళగిరి ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో AI పవర్‌తో పనిచేసే <a href="https://www.etvbharat.com/amp/en/state/ai-clinic-in-andhra-pradesh-to-deliver-60-health-test-reports-in-just-60-seconds-enn26090904476">వెల్‌నెస్ క్లినిక్‌</a> అందుబాటులోకి రానుంది. Aeros Innovation, IIVPL కలిసి ఏర్పాటు చేసిన ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో జస్ట్ 60 సెకన్లలో 60 రకాల హెల్త్ టెస్ట్‌ల డిజిటల్ రిపోర్ట్స్‌ పొందొచ్చు. ఫేస్ స్కాన్ ద్వారా 28 టెస్టులకు బ్లడ్ శాంపిల్ అవసరం లేకుండానే రిజల్ట్స్ ఇస్తుంది. IoT టెక్నాలజీతో మరో 32 టెస్టులు చేయొచ్చు. బీపీ, డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, కొన్ని లాంగ్‌టర్మ్ హెల్త్ ఇష్యూస్‌ను ముందుగా గుర్తించడమే దీని టార్గెట్.