కల్లెడలో ఘనంగా వినాయక నిమజ్జనం
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని VDC ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డప్పుల మోతలు, భక్తుల జైజై నినాదాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో VDC పెద్దమనుషులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



