← Back to news

పులిమేరులో ముంపు ప్రాంతాల పరిశీలన

By DK· 23h ago
పులిమేరులో ముంపు ప్రాంతాల పరిశీలన

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలను DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు గురువారం పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ముసలమ్మ గుడి ప్రాంతాన్ని సందర్శించిన ఆయన.. వర్షపు నీటిలో మునిగిన ఇళ్లను, స్థానికుల ఇబ్బందులను పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ఇళ్లలోకి మోకాళ్ల లోతు వరకు నీరు చేరిందని స్థానికులు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, నిలిచిన నీటిని త్వరగా తొలగించాలని అధికారులను కోరారు.

More in Local