← Back to news

బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలి

By Madhu Krishna· 1d ago
బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలి

మేడ్చల్ జిల్లాలో మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్‌లో బెల్ట్ షాపులపై నియంత్రణ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్స్‌కు నిర్ణీత సమయాలు ఉన్నప్పటికీ, కొన్ని బెల్ట్ షాపుల్లో 24గంటలూ మద్యం అందుబాటులో ఉంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఇంటికే మద్యం డెలివరీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. “Any Time! Any Where! Free Delivery!” అన్నట్టుగా అమ్మకాలు సాగుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

More in Local