← Back to news

ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల ఎంట్రీ

By Bala· 2h ago· X
ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల ఎంట్రీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివాహేతర సంబంధం విషయంలో మొదలైన వివాదం తొలుత మాటల మారి, ఆ తర్వాత పరస్పర దాడులకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఇరువర్గాలు స్టేషన్‌కు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వినాయక నిమజ్జనలో పోలీసులు ఉండటంతో సిబ్బంది తక్కువగా ఉన్నట్లు సమాచారం. నైట్‌ డ్యూటీలో ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి ఇరువర్గాలను చెదరగొట్టారు.

More in Local