← Back to news

పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఎస్సైకి గాయాలు

By Ramesh Kondru· 1d ago· Thirumalayapalem, Tirumalayapalem, Khammam
పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఎస్సైకి గాయాలు

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం భవాని హోటల్ సమీపంలో అర్ధరాత్రి పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. వినాయక నిమజ్జన విధులు ముగించుకుని పిండిప్రోలు నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌తో పాటు డ్రైవర్ కొత్తపల్లి రాకేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత తిరుమలాయపాలెం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఎస్సైకి గాయాలు

More in Local