సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో ఐక్య కూటమి ప్రచారం

సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో ఐక్యకూటమి అభ్యర్థుల తరఫున సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ MLA చాడ వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగ భద్రత కల్పించడం వంటి అంశాలపై ఐక్య కూటమి పోరాడుతోందని తెలిపారు. ఎన్నికల్లో బస్సు, నిచ్చెన గుర్తులకు ఓటు వేయాలని ఉద్యోగులను కోరారు.



