జపాన్ మహిళా టూరిస్టుకి వేధింపులు

రాజస్థాన్ లోని జైపూర్ పోర్టు సందర్శన కోసం జపాన్ నుంచి వచ్చిన ఒక మహిళా టూరిస్టు వేధింపులకు గురయ్యారు. అయిదుగురు దుండగులు ఆమె చెయ్యి పట్టుకొని అసభ్యకరంగా ప్రవర్తించారు. భయాందోళనకు గురైన ఆమె గట్టిగా కేకలు వేశారు. ఆ టైమ్ లో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ అయిదుగురు ఆమె పట్ల మరింత నీచంగా ప్రవర్తించారు. దీంతో ఆమె అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు అయిదుగురి ఫుటేజ్ సీసీటీవీలో రికార్డయింది. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


