← Back to news

మాజీ మిస్ ఇండియా ఎర్త్ అదృశ్యం

By AR· 7 Apr 2026· Telugu Report· Pune
మాజీ మిస్ ఇండియా ఎర్త్ అదృశ్యం

2019లో మిస్ ఇండియా ఎర్త్ విజేతైన సయాలీ సుర్వే అదృశ్యమయ్యారు. ఆమెతో పాటు నలుగురు పిల్లలు కూడా కనిపించడం లేదని తల్లిదండ్రులు పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తింటివారే కిడ్నాప్ చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న సయాలీ ఇటీవల తన నలుగురు పిల్లలతో కలిసి తిరిగి హిందూమతంలోకి మారారు. తన భర్త వేధింపులు భరించలేకే తిరిగి హిందూమతంలోకి వచ్చానని చెప్పారు. తన పేరుని ఆద్య అని మార్చుకున్నారు. ఇలా ఘర్ వాపసి జరిగిన కొద్ది రోజులకే ఆమె కనిపించకపోవడం కలకలం రేపుతోంది

More in Local