← Back to news

నిండు ప్రాణాలను కాపాడిన ఎస్సై!

By sahani· 4 Apr 2026· Telugu Report· Palnadu district
నిండు ప్రాణాలను కాపాడిన ఎస్సై!

పల్నాడు జిల్లాలో ఎస్సై కిషోర్ ఒక కుటుంబాన్ని మృత్యువు నుండి కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. అప్పుల బాధతో భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్యకు సిద్ధమైన అమర్‌నాథ్ అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. భార్య పంపిన సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, కారును ట్రేస్ చేసి వారిని రక్షించారు. సకాలంలో స్పందించి నలుగురి ప్రాణాలు కాపాడిన ఎస్సై, సిబ్బందిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More in Local