AI హైప్ ఓకే… రిటర్న్స్ ఎక్కడ?

AI బిజినెస్‌పై కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. కానీ ఇక్కడే ఇన్వెస్టర్లకు చిన్న డౌట్ మొదలైంది. డేటా సెంటర్లు, చిప్స్, విద్యుత్, మోడల్ ట్రైనింగ్ కోసం బిలియన్ల డాలర్లు పెడుతున్నారు. ఆ ఖర్చుకు తగ్గ లాభాలు ఎప్పుడు వస్తాయో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. పైగా ఈ పెట్టుబడుల్లో కొంత భాగం అప్పుల ద్వారా వస్తుండటంతో, వడ్డీ రేట్లు కూడా మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా AI కోసం భారీగా అప్పులు తీసుకుంటున్న టెక్ కంపెనీల బాండ్లపై ఇన్వెస్టర్లు ఎక్కువ రాబడి కోరుతున్నారు.



