← Back to news

అమరావతి భూములపై రైతుల అభ్యంతరం

By Sharmila· 2h ago
అమరావతి భూములపై రైతుల అభ్యంతరం

AP: అమరావతి విషయంలో గ్రామకంఠాల పరిధిలోని ఇళ్లు, స్థలాలు, వాటికి సంబంధించిన భూమి వ్యవహారాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని రాజధాని రైతు JAC నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రివ్యూ చేసి, పరిష్కరించాలంటూ వారు CMకి 10 అంశాలతో లేఖ పంపారు. దీనిపై వచ్చిన 685 దరఖాస్తుల్లో రూల్స్‌కి అనుకూలంగా ఉన్న వాటినే ఆమోదించామని CRDA తెలిపింది. రైతులకు రావాల్సిన ప్రయోజనాలు అందిస్తామని చెప్పింది. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమం చేస్తామని రైతు నేతలు హెచ్చరించారు.

More in AP