ఫుడ్ పాయిజనింగ్.. ఆస్పత్రిపాలైన 19 మంది స్టూడెంట్స్
AP: కాకినాడ జిల్లా, తునిలోని ఉమెన్స్ జూనియర్ కాలేజీలో శనివారం మధ్యాహ్న భోజనం తర్వాత 19 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. వారిని తుని ప్రభుత్వ ఏరియా హాస్పటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సాంబార్‌లో బల్లి పడిందని విద్యార్థినులు చెబుతున్నారు. స్టూడెంట్స్ పరిస్థితి నిలకడగా ఉందనీ, పరిశీలనలో ఉంచామని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది.


